بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
أَرَءَيْتَ ٱلَّذِى يُكَذِّبُ بِٱلدِّينِ ﴿١﴾
107:1 తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?
فَذَٰلِكَ ٱلَّذِى يَدُعُّ ٱلْيَتِيمَ ﴿٢﴾
107:2 అతడే అనాథులను కసరి కొట్టేవాడు;
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ ﴿٣﴾
107:3 మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.
فَوَيْلٌ لِّلْمُصَلِّينَ ﴿٤﴾
107:4 కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!
ٱلَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ ﴿٥﴾
107:5 ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!
ٱلَّذِينَ هُمْ يُرَآءُونَ ﴿٦﴾
107:6 ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)!
وَيَمْنَعُونَ ٱلْمَاعُونَ ﴿٧﴾
107:7 మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో!