QuranQuiz bySALSABIL STUDIO
Open the appOpen app

سورة العلق

Surah Al-'Alaq in Telugu

19 ayat · Meccan · Surah 96 of 114

🌐 Translation: తెలుగు

Englishالعربية (بلا ترجمة)اردوBahasa IndonesiaBahasa MelayuTürkçeFrançaisDeutschEspañolPortuguêsItalianoNederlandsРусскийفارسیবাংলাहिन्दीSoomaaliKiswahiliHausaShqipBosanskiAzərbaycancaOʻzbekcha中文日本語한국어ภาษาไทยTiếng ViệtTagalogپښتوPolskiSvenskaNorskSuomiČeštinaRomânăБългарскиУкраїнськаעבריתதமிழ்മലയാളംతెలుగుमराठीગુજરાતીनेपालीසිංහලঅসমীয়াسنڌيدریKurdîދިވެހިئۇيغۇرچەአማርኛAfaan OromooYorùbáKinyarwandaBamanankanChiyaoTamaziɣtMëranawТоҷикӣҚазақшаТатарчаភាសាខ្មែរEnglish (Abdel Haleem)

Translation: Maulana Abder-Rahim ibn Muhammad

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

ٱقْرَأْ بِٱسْمِ رَبِّكَ ٱلَّذِى خَلَقَ ﴿١﴾

96:1 చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు!

خَلَقَ ٱلْإِنسَـٰنَ مِنْ عَلَقٍ ﴿٢﴾

96:2 ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు.

ٱقْرَأْ وَرَبُّكَ ٱلْأَكْرَمُ ﴿٣﴾

96:3 చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.

ٱلَّذِى عَلَّمَ بِٱلْقَلَمِ ﴿٤﴾

96:4 ఆయన కలం ద్వారా నేర్పాడు.

عَلَّمَ ٱلْإِنسَـٰنَ مَا لَمْ يَعْلَمْ ﴿٥﴾

96:5 మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.

كَلَّآ إِنَّ ٱلْإِنسَـٰنَ لَيَطْغَىٰٓ ﴿٦﴾

96:6 అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు.

أَن رَّءَاهُ ٱسْتَغْنَىٰٓ ﴿٧﴾

96:7 ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు.

إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجْعَىٰٓ ﴿٨﴾

96:8 నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.

أَرَءَيْتَ ٱلَّذِى يَنْهَىٰ ﴿٩﴾

96:9 నీవు నిరోధించే వ్యక్తిని చూశావా?

عَبْدًا إِذَا صَلَّىٰٓ ﴿١٠﴾

96:10 నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి?

أَرَءَيْتَ إِن كَانَ عَلَى ٱلْهُدَىٰٓ ﴿١١﴾

96:11 ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి?

أَوْ أَمَرَ بِٱلتَّقْوَىٰٓ ﴿١٢﴾

96:12 ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?

أَرَءَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ ﴿١٣﴾

96:13 ఒకవేళ (ఆ నిరోధించే) వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే?

أَلَمْ يَعْلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ ﴿١٤﴾

96:14 వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా?

كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًۢا بِٱلنَّاصِيَةِ ﴿١٥﴾

96:15 అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము.

نَاصِيَةٍ كَـٰذِبَةٍ خَاطِئَةٍ ﴿١٦﴾

96:16 అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు!

فَلْيَدْعُ نَادِيَهُۥ ﴿١٧﴾

96:17 అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను!

سَنَدْعُ ٱلزَّبَانِيَةَ ﴿١٨﴾

96:18 మేము కూడా నరక దూతలను పిలుస్తాము!

كَلَّا لَا تُطِعْهُ وَٱسْجُدْ وَٱقْتَرِب ۩ ﴿١٩﴾

96:19 అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు!

Do you really know Surah Al-'Alaq by heart?

A short test shows exactly where you slip. No sign-up, free.

Start the test

Hear Surah Al-'Alaq from all 90 reciters →