بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
ٱلْقَارِعَةُ ﴿١﴾
101:1 ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం!
مَا ٱلْقَارِعَةُ ﴿٢﴾
101:2 ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?
وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْقَارِعَةُ ﴿٣﴾
101:3 మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?
يَوْمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلْفَرَاشِ ٱلْمَبْثُوثِ ﴿٤﴾
101:4 ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.
وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ ٱلْمَنفُوشِ ﴿٥﴾
101:5 మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.
فَأَمَّا مَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ ﴿٦﴾
101:6 అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!
فَهُوَ فِى عِيشَةٍ رَّاضِيَةٍ ﴿٧﴾
101:7 అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.
وَأَمَّا مَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ ﴿٨﴾
101:8 మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!
فَأُمُّهُۥ هَاوِيَةٌ ﴿٩﴾
101:9 అతని నివాసం అధః పాతాళమే.
وَمَآ أَدْرَىٰكَ مَا هِيَهْ ﴿١٠﴾
101:10 మరియు అది ఏమిటో నీకేం తెలుసు?
نَارٌ حَامِيَةٌۢ ﴿١١﴾
101:11 అదొక భగభగమండే అగ్ని (గుండం).