بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
وَٱلشَّمْسِ وَضُحَىٰهَا ﴿١﴾
91:1 సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా!
وَٱلْقَمَرِ إِذَا تَلَىٰهَا ﴿٢﴾
91:2 దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా!
وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا ﴿٣﴾
91:3 ప్రకాశించే పగటి సాక్షిగా!
وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰهَا ﴿٤﴾
91:4 దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా!
وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا ﴿٥﴾
91:5 ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
وَٱلْأَرْضِ وَمَا طَحَىٰهَا ﴿٦﴾
91:6 భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా!
وَنَفْسٍ وَمَا سَوَّىٰهَا ﴿٧﴾
91:7 మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా!
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَىٰهَا ﴿٨﴾
91:8 ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.
قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا ﴿٩﴾
91:9 వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు.
وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا ﴿١٠﴾
91:10 మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَىٰهَآ ﴿١١﴾
91:11 సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు;
إِذِ ٱنۢبَعَثَ أَشْقَىٰهَا ﴿١٢﴾
91:12 అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: "ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు.
فَقَالَ لَهُمْ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقْيَـٰهَا ﴿١٣﴾
91:13 అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు.
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنۢبِهِمْ فَسَوَّىٰهَا ﴿١٤﴾
91:14 కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు.
وَلَا يَخَافُ عُقْبَـٰهَا ﴿١٥﴾
91:15 మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు!