QuranQuiz bySALSABIL STUDIO
Open the appOpen app

سورة البلد

Surah Al-Balad in Telugu

20 ayat · Meccan · Surah 90 of 114

🌐 Translation: తెలుగు

Englishالعربية (بلا ترجمة)اردوBahasa IndonesiaBahasa MelayuTürkçeFrançaisDeutschEspañolPortuguêsItalianoNederlandsРусскийفارسیবাংলাहिन्दीSoomaaliKiswahiliHausaShqipBosanskiAzərbaycancaOʻzbekcha中文日本語한국어ภาษาไทยTiếng ViệtTagalogپښتوPolskiSvenskaNorskSuomiČeštinaRomânăБългарскиУкраїнськаעבריתதமிழ்മലയാളംతెలుగుमराठीગુજરાતીनेपालीසිංහලঅসমীয়াسنڌيدریKurdîދިވެހިئۇيغۇرچەአማርኛAfaan OromooYorùbáKinyarwandaBamanankanChiyaoTamaziɣtMëranawТоҷикӣҚазақшаТатарчаភាសាខ្មែរEnglish (Abdel Haleem)

Translation: Maulana Abder-Rahim ibn Muhammad

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

لَآ أُقْسِمُ بِهَـٰذَا ٱلْبَلَدِ ﴿١﴾

90:1 కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)!

وَأَنتَ حِلٌّۢ بِهَـٰذَا ٱلْبَلَدِ ﴿٢﴾

90:2 మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.

وَوَالِدٍ وَمَا وَلَدَ ﴿٣﴾

90:3 మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా!

لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَـٰنَ فِى كَبَدٍ ﴿٤﴾

90:4 వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము.

أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ ﴿٥﴾

90:5 ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా?

يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا ﴿٦﴾

90:6 అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.

أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُۥٓ أَحَدٌ ﴿٧﴾

90:7 ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?

أَلَمْ نَجْعَل لَّهُۥ عَيْنَيْنِ ﴿٨﴾

90:8 ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?

وَلِسَانًا وَشَفَتَيْنِ ﴿٩﴾

90:9 మరియు నాలుకను మరియు రెండు పెదవులను.

وَهَدَيْنَـٰهُ ٱلنَّجْدَيْنِ ﴿١٠﴾

90:10 మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.

فَلَا ٱقْتَحَمَ ٱلْعَقَبَةَ ﴿١١﴾

90:11 కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు!

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْعَقَبَةُ ﴿١٢﴾

90:12 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?

فَكُّ رَقَبَةٍ ﴿١٣﴾

90:13 అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.

أَوْ إِطْعَـٰمٌ فِى يَوْمٍ ذِى مَسْغَبَةٍ ﴿١٤﴾

90:14 లేదా! (స్వయంగా) ఆకలి గొని ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.

يَتِيمًا ذَا مَقْرَبَةٍ ﴿١٥﴾

90:15 సమీప అనాథునికి గానీ;

أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ ﴿١٦﴾

90:16 లేక, దిక్కులేని నిరుపేదకు గానీ!

ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ وَتَوَاصَوْا۟ بِٱلْمَرْحَمَةِ ﴿١٧﴾

90:17 మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.

أُو۟لَـٰٓئِكَ أَصْحَـٰبُ ٱلْمَيْمَنَةِ ﴿١٨﴾

90:18 ఇలాంటి వారే కుడిపక్షం వారు.

وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِنَا هُمْ أَصْحَـٰبُ ٱلْمَشْـَٔمَةِ ﴿١٩﴾

90:19 ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు.

عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌۢ ﴿٢٠﴾

90:20 వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.

Do you really know Surah Al-Balad by heart?

A short test shows exactly where you slip. No sign-up, free.

Start the test

Hear Surah Al-Balad from all 90 reciters →