QuranQuiz bySALSABIL STUDIO
Open the appOpen app

سورة الطارق

Surah At-Tariq in Telugu

17 ayat · Meccan · Surah 86 of 114

🌐 Translation: తెలుగు

Englishالعربية (بلا ترجمة)اردوBahasa IndonesiaBahasa MelayuTürkçeFrançaisDeutschEspañolPortuguêsItalianoNederlandsРусскийفارسیবাংলাहिन्दीSoomaaliKiswahiliHausaShqipBosanskiAzərbaycancaOʻzbekcha中文日本語한국어ภาษาไทยTiếng ViệtTagalogپښتوPolskiSvenskaNorskSuomiČeštinaRomânăБългарскиУкраїнськаעבריתதமிழ்മലയാളംతెలుగుमराठीગુજરાતીनेपालीසිංහලঅসমীয়াسنڌيدریKurdîދިވެހިئۇيغۇرچەአማርኛAfaan OromooYorùbáKinyarwandaBamanankanChiyaoTamaziɣtMëranawТоҷикӣҚазақшаТатарчаភាសាខ្មែរEnglish (Abdel Haleem)

Translation: Maulana Abder-Rahim ibn Muhammad

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ ﴿١﴾

86:1 ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా!

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلطَّارِقُ ﴿٢﴾

86:2 రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?

ٱلنَّجْمُ ٱلثَّاقِبُ ﴿٣﴾

86:3 అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం.

إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ ﴿٤﴾

86:4 కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు.

فَلْيَنظُرِ ٱلْإِنسَـٰنُ مِمَّ خُلِقَ ﴿٥﴾

86:5 కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి!

خُلِقَ مِن مَّآءٍ دَافِقٍ ﴿٦﴾

86:6 అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు.

يَخْرُجُ مِنۢ بَيْنِ ٱلصُّلْبِ وَٱلتَّرَآئِبِ ﴿٧﴾

86:7 అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది.

إِنَّهُۥ عَلَىٰ رَجْعِهِۦ لَقَادِرٌ ﴿٨﴾

86:8 నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు!

يَوْمَ تُبْلَى ٱلسَّرَآئِرُ ﴿٩﴾

86:9 ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో!

فَمَا لَهُۥ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ ﴿١٠﴾

86:10 అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు.

وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجْعِ ﴿١١﴾

86:11 వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా!

وَٱلْأَرْضِ ذَاتِ ٱلصَّدْعِ ﴿١٢﴾

86:12 (చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా!

إِنَّهُۥ لَقَوْلٌ فَصْلٌ ﴿١٣﴾

86:13 నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి).

وَمَا هُوَ بِٱلْهَزْلِ ﴿١٤﴾

86:14 మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు.

إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا ﴿١٥﴾

86:15 (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు.

وَأَكِيدُ كَيْدًا ﴿١٦﴾

86:16 మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను.

فَمَهِّلِ ٱلْكَـٰفِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًۢا ﴿١٧﴾

86:17 కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధి నివ్వు! వారి పట్ల మృదువుగా వ్యవహరించు.

Do you really know Surah At-Tariq by heart?

A short test shows exactly where you slip. No sign-up, free.

Start the test

Hear Surah At-Tariq from all 90 reciters →